GNTR: పెదకాకాని మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం గురువారం జరిగింది. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా పోరాడి బాషీర్బాగ్లో అమరులైన వీరులను ఈ సందర్భంగా నేతలు స్మరించుకుని నివాళులర్పించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలు, పెరిగిన ఛార్జీలు, స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు.