BRS: జిల్లాలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో గురువారం కొత్తగూడెం పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వారితోపాటు BRS పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.