KDP: ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గురువారం ఉదయం పరిశీలించారు. ఇందులో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప డీఈవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.