KRNL: పెద్దకడబూరు మండలం కలుకుంట గ్రామం నుంచి మేకడోన వరకు దాదాపు రూ.1.35 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులను ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ ఏఈ రాఘవేంద్ర రెడ్డి గురువారం పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల్లో ఏలాంటి మెటీరియల్ను ఉపయోగిస్తున్నారని సూపర్వైజర్ రామును అడిగి తెలుసుకున్నారు. కలుకుంటలో దాదాపు 120 మీటర్ల సీసీ రహదారి పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.