TG: వరదలపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల విమర్శలు సరికాదని మండిపడ్డారు. కాసేపట్లో వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారని తెలిపారు. ముందుగా ఎల్లంపల్లిలో, అనంతరం కామారెడ్డిలో పర్యటిస్తారని వెల్లడించారు.