SKLM: పలాస మండలం కిష్టుపురం గ్రామంలో గురువారం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు తులసిరావు, నాయకులు కృష్ణంరాజుతో కలిసి గ్రామంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు ఈ స్మార్ట్ కార్డ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం నల్ల బజారుకి తరలిపోకుండా నివారించవచ్చన్నారు.