TG: సిరిసిల్ల జిల్లాలోని నర్మల ప్రాంతంలోని ఎగువ మానేరు వద్ద వరదలో చిక్కుకున్న ఐదుగురిని ఆర్మీ హెలీకాప్టర్ సురక్షితంగా తీసుకొచ్చింది. వరద ఉద్ధృతికి నిన్న మానేరులో చిక్కుకున్న ఐదుగురు పశువుల కాపరులను హెలీకాప్టర్ సహాయంతో అధికారులు బయటకు తీసుకొచ్చారు. కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్ విజ్ఞప్తికి కేంద్ర రక్షణ శాఖ స్పందించి హెలీకాప్టర్లను పంపిన విషయం తెలిసిందే.