KDP: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శ్రీ రంగడి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తులను పూల మాలలతో అలంకరించి భక్తులకు దర్శింపచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.