TG: వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ‘రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సహాయకచర్యల కోసం NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. సిరిసిల్లలో వరదల్లో చిక్కుకున్న వారిని ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాం. ప్రాణనష్టం నివారించటానికి ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.