NLG: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నార్కెట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీధికుక్కల బారిన పడకుండ తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, కుక్క కాటుకు గురైన వారికి రేబిస్ సోకకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.