కృష్ణా: గుడివాడలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతపై ఎస్సై నాగరాజు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణ రక్షకంగా ఉంటుందని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగిన అనేక ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. వాహనదారులు తప్పనిసరిగా ISI మార్క్ కలిగిన హెల్మెట్లు ధరించాలని సూచించారు.