NDL: అవుకు మండలం రామాపురం గ్రామంలో ఇవాళ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను అవుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఎడమకంటి ఉగ్రసేనారెడ్డి ఘనంగా ప్రారంభించారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నూతనంగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని ఉగ్రసేనారెడ్డి అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.