CTR: అధికారులు సమిష్టిగా పనిచేసి సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, కడా పీడీ వికాస్ మర్మత్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గురువారం సమావేశమయ్యారు. ఈ మేరకు సీఎం పర్యటనపై అధికారులతో చర్చించారు.