HYD: కీసర PS పరిధిలో ఖాళీ స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోట్లు దండుకుంటున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాంపల్లి, ఘట్కేసర్లో వృద్ధుల భూములే లక్ష్యంగా చేసుకొని, నకిలీ డెత్ సర్టిఫికెట్లు, సేల్ డీడ్లు తయారు చేసి అక్రమంగా విక్రయిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్ టాప్, నకిలీ డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.