SRD: సంగారెడ్డి జిల్లా బొల్లారం ముస్సిపాలిటీ పరిధిలోని మాధవనికుంటను మున్సిపల్ కమిషనర్, అధికారులు గురువారం పరిశీలించారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని ఇక్కడ జరిగే వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో కుంటలోకి వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.