GNTR: మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్వమిత్వ ట్రూత్ సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఆన్లైన్ విధానం ద్వారా సర్వే జరుగుతున్న తీరును ఆయన తెలుసుకున్నారు. ఇప్పటివరకు1290 ప్రాపర్టీ పార్సిల్ నెంబర్లను పూర్తి చేశామని, సిబ్బంది జేసీకి వివరించారు.