TG: రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ హెలికాప్టర్, సిరిసిల్ల జిల్లాలోని నర్మల ప్రాంతానికి చేరుకుంది. ఎగువ మానేరు వద్ద వరదలో చిక్కుకున్న ఐదుగురు రైతులను రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్‌ను అధికారులు రంగంలోకి దించారు. గంభీరావుపేట వద్ద ఐదుగురు రైతులు వరదలో చిక్కుకుపోగా.. నిన్నటి నుంచి వారు అక్కడే ఉండిపోయారు. స్థానికాధికారులు వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని పంపించారు.