ADB: జైనథ్ మండలం డోలార వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జైనథ్ సీఐ నాగనాథ్‌కు తీవ్ర గాయాలు కాగా డ్రైవర్ షబ్బీర్‌కు సైతం గాయాలయ్యి. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీతో పాటు డీఎస్పీ జీవన్ రెడ్డి, పోలీసు అధికారులు ఉన్నారు.