NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని ఎస్సి సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సోమవారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ భవనం శిథిలవస్థలో ఉందని వెంటనే మరమ్మతులు చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మరమ్మతులతో పాటు నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.