ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్బాస్-9’ SEP 5న ప్రారంభం కాబోతుంది. ఈ షోలో ‘నువ్వు నాకు నచ్చావ్’ ఫేమ్ ఆశా సైనీ, ‘బుజ్జిగాడు’ ఫేమ్ సంజన, ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ‘అగ్నిపరీక్ష’ పేరుతో షో కండక్ట్ చేసి సామాన్య ప్రజలను ఎంపిక చేస్తున్నారు.