అనంతపురంలోని అరవింద్ నగర్లో నిందితుల దాడిలో గాయపడిన సీఐ శ్రీకాంత్ యాదవ్‌ను రాష్ట్ర మంత్రి సవిత పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం మత్తులో జరిగిన గొడవలో ముద్దాయిలను అరెస్ట్ చేసే క్రమంలో సీఐపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనపై ఆరా తీసిన మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.