MDCL: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు, బిల్లులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సరఫరా బిల్లులు గత 8 నెలలుగా చెల్లించలేదని వాపోయారు. మొత్తం రూ.1.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని పేర్కొంన్నారు. అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ చెల్లింపులు చేపట్టాలన్నారు.