ELR: పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి సోమవారం బంద్కు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రం ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు సహకరించి విజయవంతం చేయాలని సాధన సమితి విజ్ఞప్తి చేసింది.