HYD: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పాటించని వివిధ కంపెనీలపై పీసీబీ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. గ్రేటర్ HYDలో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 2,000కి పైగా పరిశ్రమలను తనిఖీ చేయగా, 300కు పైగా పరిశ్రమలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదుల కోసం 10741 కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.