ATP: ఆత్మకూరు మండలంలో పాడి పశువుల సంఖ్య రెట్టింపు కావడంతో వరిగడ్డికి భారీగా డిమాండ్ పెరిగింది. పశుపోషణే జీవనాధారంగా కలిగిన రైతులు కణేకల్లు, బొమ్మనహాళ్ నుంచి ట్రాక్టర్లలో గడ్డిని తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్ వరిగడ్డి ధర రూ.9 వేలకు పైగా పలుకుతోంది. రోజూ పదుల సంఖ్యలో వాహనాల్లో వస్తున్న గడ్డిని రైతులు పోటీపడి కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.