ATP: వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనంతపురం నగరంలో ఇవాళ సాయంత్రం నుంచి ఈ నెల 30 అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ మళ్ళింపులు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణదుర్గం, బళ్ళారి వాహనాలు సుభాష్ రోడ్, రాజు రోడ్డు మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలని సూచించారు. తాడిపత్రి వైపు వాహనాలు ఎన్టీఆర్ మార్గ్ లేదా కలెక్టరేట్ మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు.