»Tough Competition For Kalki Huge Demand For Ott Rights
Kalki 2898 AD: ‘కల్కి’ కోసం గట్టి పోటీ.. ఓటిటి రైట్స్‌కు భారీ డిమాండ్?
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కల్కి ఓటిటి డీల్స్ కోసం గట్టి పోటీ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ కల్కి ఓటిటి రైట్స్ ఎంత?
Tough competition for 'Kalki'.. Huge demand for OTT rights?
Kalki 2898 AD: సమ్మర్లో రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ సినిమా పై భారీ అంచనాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా కల్కిని తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో కల్కి రూపొందుతోంది. దీంతో ఈ సినిమాకు మార్కెట్ రిత్యా మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి. కల్కి డిమాండ్‌ను బట్టి భారీగా కోట్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో.. ఓటిటి కోసం గట్టి పోటీ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. రెండు ఓటిటి సంస్దల మధ్య పోటీ మామూలుగా లేదనే టాక్ నడుస్తోంది. ప్రముఖ ఓటిటి సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో కల్కి రైట్స్ కోసం రేసులో ఉన్నాయట. ఎలాగైనా సరే కల్కి డిజిటల్ రైట్స్ దక్కించుకునేలా గట్టిగా ట్రై చేస్తున్నాయట.
అయితే ఓటిటి హక్కుల కోసం మూవీ మేకర్స్ 200 కోట్లకి పైగా డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం 150 కోట్లు-170 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయట. అయితే.. రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి కాబట్టి.. కల్కి రైట్స్ కోసం సదరు సంస్థలు 200 కోట్లు ఖర్చు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇదే జరిగితే.. కల్కి ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. వీలైనంత త్వరలోనే ఈ ఓటిటి డీల్ క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది. అలాగే థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. అయితే.. మే 9న కల్కి రిలీజ్ అవుతుందా? లేదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.