ఈసారి సుకుమార్, రామ్ చరణ్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో.. ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. రంగస్థలం సినిమాలో తన యాక్టింగ్‌తో ఇరగదీశాడు రామ్ చరణ్. చిట్టిబాబుగా అదరగొట్టేశాడు. దీంతో ఇప్పుడు చరణ్‌తో సుకుమార్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
RC17: ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు సుకుమార్. పుష్ప సినిమాతో బన్నీకి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన సుకుమార్.. పుష్ప2తో వెయ్యి కోట్లు టార్గెట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి రామ్ చరణ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా రెండు రోజుల ముందే.. ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్‌తో సినిమా ప్రకటించారు. జోడు గుర్రాల పోస్టర్‌తో రోరింగ్ టూ కాంకర్.. అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచి ఈ సినిమా ఏ జానర్లో రాబోతుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ పై కొన్ని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. రంగస్థలం లాగే.. చరణ్ కోసం సుకుమార్ మళ్లీ ఓ పీరియాడిక్ డ్రామాను రెడీ చేసినట్లు సమాచారం. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్లో మద్రాసు పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందనుందనే టాక్ నడుస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ స్పై ఎమోషనల్ యాక్షన్ జర్నీనే.. ఆర్సీ 17 మెయిన్ స్టోరీ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి రాజమౌళి తనయుడు కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ‘ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో.. సుకుమార్‌తో మూవీ చేయబోతున్నట్లు రామ్ చరణ్ మాటల్లో సందర్భంగా చెప్పాడు. అంతేకాదు.. ఈ మూవీలో ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి కూడా వివరించాడు. ఐదు నిమిషాల పాటు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పటి నుంచీ ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా అది ఓ ఐకానిక్ సీక్వెన్స్ అవుతుంది. నేను దీని గురించి మరీ ఎక్కువగా లీక్ చేయనులే.. అంటూ రామ్ చరణ్‌ను ట్యాగ్ చేశాడు కార్తికేయ. దీంతో.. ఇప్పటి నుంచే ఆర్సీ 17 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సారి చరణ్, సుకుమార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.