మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ రెండువందల యాభై అడుగులకు పైచిలుకు ఎత్తులో విజయవాడలో మెగాఅభిమానులు నిలబెట్టిన ఈ కటౌట్ మొత్తం ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు, వరల్డ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి. అయితే ఇంతంత ఎత్తుల్లో కటౌట్లు వెలసింది మాత్రం ఇంతకు ముందు కేవలం ఒక్క మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే
గేమ్ చేంజర్ సినిమా విడుదల సందర్భంగా విజయవాడలో అభిమానులు ఆవిష్కరించిన రామ్‌చరణ్ నిలువెత్తు కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియా చెప్పలేనంత సందడి చేస్తోంది. ఇంతకన్నా హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ మరొకటి లేనేలేదు. మొన్నీమధ్యనే విజయవాడలో జరిగిన ఈ కటౌట్ అన్‌వెయిలింగ్ కార్యక్రమం మెగా అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని, ఊపునీ నింపింది.
అగ్రనిర్మాత దిల్‌రాజు తాజాగా శంకర్ దర్శకత్వంలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ రెండువందల యాభై అడుగులకు పైచిలుకు ఎత్తులో విజయవాడలో మెగాఅభిమానులు నిలబెట్టిన ఈ కటౌట్ మొత్తం ఇండియన్ సినిమా హిస్టరీలోనే కాదు, వరల్డ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి. అయితే ఇంతంత ఎత్తుల్లో కటౌట్లు వెలసింది మాత్రం ఇంతకు ముందు కేవలం ఒక్క మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే జరిగింది. అభిమానుల శక్తిసామర్ద్యాల మీద, తమ అభిమాన కథానాయకుడిపట్ల వారికున్న అచంచల భక్తి, ఇష్టం అన్నీ కలిస్తేనే ఇటువంటి విచిత్రాలు జరుగుతాయి. అందులో మాత్రం మెగాఅభిమానులది మాత్రం అందెవేసిన చేయని చెప్పకతప్పదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు అనేక దశాబాబ్దాలుగా కొనసాగుతున్నవారు ఎందరో, ఎందరో అయితే, ఇటీవలి తరంలోని వారు కూడా అసంఖ్యాకులు మెగా అభిమానులుగా మారిపోయారు. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి కడుపున పుట్టి, అతి తక్కువ చిత్రాలతోనే అపారమైన అభిమానులను సంతరించుకుని, తన తండ్రి బాటలోనే ప్రయాణించగలుగుతున్నందుకు రామ్ చరణ్ గౌరవం ఆకాశం ఎత్తుకు ఎదిగింది మగధీర చిత్రం నుంచి తీసుకుంటే తర్వాత వచ్చిన రంగస్థలం, అనంతరం వచ్చిన త్రిబుల్ ఆర్ చిత్రాలతో రామ్ చరణ్ అంటే పులి కడుపున పుట్టిన పులిగానే గుర్తింపు తెచ్చుకోగలిగాడు రామ్ చరణ్.
ఇప్పుడు మెగాఅభిమానులు ఏర్పాటు చేసిన కటౌట్ ఎంత ఎత్తైనది అయినా కూడా రామ్ చరణ్ సాధించిన ఘనత కన్నా పొట్టిదే అవుతుంది. హాలీవుడ్ పరిశ్రమవారే తమ సినిమాల్లో చేయమని రామ్ ఛరణ్ని అడిగితే ఆల్రెడీ తను కమిట్ అయిన రెండు ఇండియన్ ఫిల్మ్స్ పూర్తయ్యేంతవరకూ చేయలేనని చరణ్ చెప్పడం కన్నా గొప్పతనం మరొకటి లేదు. తెలుగు సినిమాలని చెప్పలేదు రామ్ చరణ్. ఇండియన్ సినిమాలు అని చెప్పడంలోనే రామ్ చరణ్ రేంజ్ అర్ధం చేసుకుంటే అర్ధమవుతుంది. రామ్ చరణ్‌ని గ్లోబల్ స్టార్ అనడం ఎంతైనా సమంజసం కదూ.మరోసారి రాస్తాను. అందుకే రామ్ చరణ్ సాధించిన ఘనత ముందు ఎంత ఎత్తైనదైనా ఈ కటౌట్ పొట్టిదే. కాకపోతే మరే ఇతర హీరోకి ప్రపంపంలోనే ఇంత హైట్ కటౌట్ ఇంతవరకూ లేనేలేదు. ఇంతకన్నా ఎత్తైనది తయారుచేయడం ఎవ్వడి సాధ్యం కాదు. అది కేవలం మెగా అభిమానులకే సాథ్యమైంది. గ్రేట్ మెగాఫేన్స్.