»Upendra Upendras New Song Where Did The Trolling Come From Babu
Upendra: ఉపేంద్ర కొత్త సాంగ్.. ఇదెక్కడి ట్రోలింగ్ రా బాబు?
ఉపేంద్ర అంటేనే కేరాఫ్ డిఫరెంట్ సినిమాలని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టిన ఉప్పి.. యూఐ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ చూస్తే ట్రోలింగ్ కోసమే తీసినట్టుంది.
Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా, హీరోగా కన్నడ, తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర.. ఎన్నో A రేటేడ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అసలు ఉపేంద్ర స్టైలే వేరు. అతని నుంచి సినిమా వస్తుందంటే.. ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. చివరగా కబ్జా మూవీతో పాన్ ఇండియా రేంజ్లో అలరించిన ఉపేంద్ర.. ఇప్పుడు మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తర్వాత ‘UI’ అనే సినిమాతో మెగాఫోన్ పట్టాడు ఉప్పి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశాడు. ఇది ఏఐ వరల్డ్ కాదు.. యూఐ వరల్డ్ అంటు హైప్ పెంచుతున్నాడు. ఉపేంద్ర స్టైల్లో ఊహకు అందని విధంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలె ఈ సినిమా నుంచి ఓ వెరైటీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశాడు. అంతా చీప్ చీప్.. అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ వైరల్‌గా మారింది. నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది.. అంటూ డబుల్ మీనింగ్ తరహా లిరిక్స్‌ను ఈ సాంగ్‌లో చూడొచ్చు. ఇక ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ చేసి వైరల్ చేశాడు ఉప్పి. మీమ్స్‌లో ఉన్న ట్రోల్స్ మొత్తం ఈ ఒక్క సాంగ్ లోనే చూపించాడు.
ఏపి సీఎం జగన్, హీరో పవన్ కళ్యాణ్ నుంచి కుమారి ఆంటీ వరకు ఎవరిని వదలకుండా ఉంది ఈ సాంగ్. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సాంగ్‌కు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా మంగ్లీ పాడింది. ప్రస్తుతం ఈ ట్రోల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఈ సాంగ్ పై కూడా ట్రోలింగ్ జరుగుతుండడం విశేషం. మరి ఈ సినిమాతో ఉపేంద్ర ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.