»Gaami Gami Increased Expectations In Censor Certificate
Gaami: గామి.. సెన్సార్ సర్టిఫికేట్లో పెరిగిన అంచనాలు!
ఈ వారం తెలుగు నుంచి వస్తున్న సినిమాల్లో విశ్వక్ సేన్ 'గామి' పై మంచి బజ్ ఉంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గామి.. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. కానీ ఈ సినిమాకు ఊహించని సర్టిఫికేట్ వచ్చింది.
Gaami: మాస్ కా దాస్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ గామి. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొడితే విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేలా ఈ సినిమా పై హైప్ కనిపిస్తోంది. ఇందులో హీరో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు విశ్వక్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఈ వారమే గ్రాండ్‌గా గామి థియేటర్లోకి రాబోతోంది గామి. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది గామి.
అయితే.. ముందు నుంచి ఈ సినిమా కంటెంట్‌ను బట్టి.. సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా A సర్టిఫికెట్ రావడం విశేషం. ట్రైలర్లో A సర్టిఫికేట్స్ విజువల్స్ అయితే పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు సెన్సార్ నుంచి ఇలాంటి సర్టిఫికేట్ రావడం కాస్త ఆశ్చర్యంగానే ఉందంటున్నారు. అంతేకాదు.. A సర్టిఫికేట్ మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. అసలే ఈ మధ్య వచ్చిన A రేటెడ్ మూవీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
అనిమల్ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో.. గామి సినిమాపై మరింత అంచనాల పెరిగాయి. అయితే.. గామి సినిమాకు A సర్టిఫికెట్ రావడానికి అసలు కారణం ఏంటి అనేది.. తెలియాలంటే మార్చ్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో చాందిని చౌదరి ఫీమేల్ రోల్ ప్లే చేస్తోంది. మరి గామితో విశ్వక్ సేన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.