కృష్ణా: తంబి జీవితం ప్రేమ, దయ, కరుణలకు ప్రతీక అని MSFS ప్రొవిన్షియల్ ఫాదర్ బి. సురేష్ బాబు అన్నారు. ఉంగుటూరు (M) పెద్దఆవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబి వర్ధంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసఫ్, మేరీమాత కపూచియన్ సభ ప్రొవిన్షియల్ ఫాదర్ మరియదాసుతో కలిసి మహోత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.