ATP: రాప్తాడు మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న పీజీటీ ఎకనామిక్స్ అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. 9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇవాళ ధ్రువీకరణ పత్రాలు, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో పాఠశాలలో స్వయంగా హాజరుకావాలని సూచించారు.