పుష్ప2 సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 నెక్స్ట్ షెడ్యూల్‌ను అక్కడే ప్లాన్ చేస్తున్నారట.
Pushpa-2: పుష్ప పార్ట్ 1 రిజల్ట్ చూసిన తర్వాత పార్ట్ 2లో కథలో చాలా మార్పులు చేశాడు సుకుమార్. అందుకే.. స్కిప్టు లాక్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ముఖ్యంగా హిందీలో పుష్పరాజ్‌కు బ్రహ్మరథం పట్టారు జనాలు. దీంతో.. సెకండ్ పార్ట్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్నాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో అద్భుతం అనేలా డిజైన్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల మాట. ఇప్పటికే రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప గ్లింప్స్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. అలాగే.. లీకులు కూడా పుష్ప2 మామూలుగా ఉండదని చెబుతున్నాయి. ముఖ్యంగా జాతర సెటప్‌లో అల్లు అర్జున్ అమ్మవారు గెటప్‌కు థియేటర్లు బ్లాస్ట్ అవడం గ్యారెంటీ అని అంటున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప2. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. హైదరాబాద్‌లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్.. వైజాగ్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత షెడ్యూల్ కూడా గ్యాప్ లేకుండా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట. వీలైనంత త్వరగా పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసి.. ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ పుష్పరాజ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి పుష్ప2 ఎలా ఉంటుందో చూడాలి.