CM Bhajan Lal Sharma : రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు కరోనా వైరస్ సోకింది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సిఎం భజన్‌లాల్ శర్మ మాట్లాడుతూ, “నేను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. వైద్యుల సలహాలను పూర్తిగా పాటిస్తున్నాను. వర్చువల్ మీడియం ద్వారా రాబోయే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటాను.” అంటూ రాసుకొచ్చారు. ఇంతలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్వీట్ చేశారు.
स्वास्थ्य समस्या के चलते आज स्वास्थ्य परीक्षण करवाने पर आज मेरी कोविड रिपोर्ट पॉजिटिव आई है।
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं एवं आगामी सभी कार्यक्रमों में वर्चुअल माध्यम से सम्मिलित रहूंगा।
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 6, 2024
కరోనా పాజిటివ్‌గా ఉన్నందున, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వ్యవసాయ పరిశోధనా కేంద్రం దుర్గాపురలో నిర్వహించిన శక్తి వందన్ అభియాన్ ముగింపు కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. దీంతో పాటు అక్కడ ఉన్న మహిళా శక్తిని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ శక్తి వందన్ కార్యక్రమంలో ప్రసంగించారు.