బెంగళూరులో ట్రాఫిక్ సమస్యను క్యాష్ చేసుకుంటున్న యూబీ సిటీ మాల్ గంటకు రూ. 1000 వసుళ్లు చేస్తుంది. నగరంలో గత 9 ఏళ్లలలో రూ. 40 నుంచి రూ. 1000కి పార్కింగ్ ఫీజు పెరిగింది.
Premium parking Parking fee in mall in Bangalore is Rs.1000 per hour
Premium parking: సిలికాన్ సిటీ బెంగళూరు(Bangalore) అంటే ఐటీ కంపెనీలు, యువ వ్యాపారవేత్తలు మాత్రమే కాదు ట్రాఫక్ సమస్య కూడా గుర్తుకొస్తుంది. అది ఎంత పెద్ద కమర్షియల్ సిటీ అయినా భారీ ట్రాఫిక్(Traffic problem) మూలంగా బెంగళూరు పేరు వింటేనే బెంబేలెత్తిపోతారు. ప్రస్తుతం బెంగళూరు పార్కింగ్ ఫీజు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రీమియమ్ పార్కింగ్ పేరిట కొన్ని షాపింగ్ మాల్స్ క్యాష్ చేసుకునే పనిలో తలామునకలై ఉన్నారు. వాహనాల పార్కింగ్ కోసం ఒక గంటకు ఏకంగా రూ. 1000 వరకు ఫీజును వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సైన్ బోర్డు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. యూబీ సిటీలో వాహనాల పార్కింగ్ ఫీజు తాలూకు ఓ ఫోటో వైరల్ అవుతుంది. అందులో పార్కింగ్ ఫీజు గంటకు వెయ్యి రూపాయలు అని ఉంది.
ఇషాన్ వైష్ అనే ఎక్స్ ఖాతా దారుడు ఈ ఫొటోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. యూబీ సిటీ పార్కింగ్‌లో ఏదైనా ప్రత్యేకత ఉందా అని కొందరు అంటున్నారు. రూ. 1000 అంటే మధ్యతరగతి వాడి రోజు సంపాదన అని మరికొందరు అంటున్నారు. కర్ణాటక రాజధానిలో 2015 కాలంలో పార్కింగ్ ఫీజు రూ. 40 ఉండేది, కానీ ఇప్పుడు అది పెరుగుతూ పోతుందని వాహనాదారులు వలపోస్తున్నారు. ఇక ఈ సమస్యను క్యాష్ చేసుకోవాలనేే వ్యాపారులు మాత్రం దండిగా సంపాదించుకుంటున్నారని అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.