»On The Abuse Of The Wife At Bangalore Sarjapur Husbands Post On Social Media
Abuse: భార్యకు వేధింపులపై..సోషల్ మీడియాలో భర్త ఆవేదన
ఇండియన్ ఐటీ క్యాపిటల్ బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి రాత్రి నగరంలో తన భార్యకు ఎదురైన వేధింపుల సంఘటనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ క్రమంలో బెంగళూరు నగరం ఎంత అసురక్షితంగా ఉందోనని భయాందోళన వ్యక్తం చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
On the abuse of the wife at bangalore sarjapur husband's post on social media
భారత ఐటీ రాజధాని బెంగళూరు(bangalore)లో ఒక మహిళకు భయానక సంఘటన ఎదురైంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా తన భార్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో శ్రీజన్ ఆర్ శెట్టి చేసిన పోస్ట్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 8న సర్జాపూర్ నుంచి క్యాబ్ పొందడం కష్టంగా ఉన్నందున అతని భార్య మరికొందరు సహోద్యోగులను (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) ఇంటి వద్ద డ్రాప్ చేయమని కోరింది. ఆ క్రమంలో వారిని గమనించిన పలువురు దుండగులు మరో వాహనంలో ఆమె కారును వెంబడించారు. అంతేకాదు ఆమె కారును ఢీకొట్టి కారును ఆపాలను నానా రచ్చ చేశారు. ఆ క్రమంలోనే యాక్సిడెంట్ పేరుతో వేధింపులకు గురిచేశారు. అయినా కూడా వారి బెదిరింపులను పట్టించుకోకుండా ఆమె కారు నుంచి బయటకు దిగలేదు. ఆ నేపథ్యంలోనే పోలీసులకు, తన భర్తకు ఫోన్ చేసి చెప్పి లోకేషన్ షేర్ చేసింది. ఆ తర్వాత పోలీసులు, ఆమె భర్త రావడంతో వివాదం సద్దుమణిగింది.
I’ve never felt unsafe in Bangalore – I know my privilege of being a Kannada speaking male – but last Thursday night I felt how unsafe certain parts of the city are post 10pm.
I’ve seen those horrific videos of fake accidents in Sarjapur where hooligans have tried to blackmail… pic.twitter.com/lwHK8dymZM
ఇది చూసిన అతను నగరంలోని కొన్ని ప్రాంతాలు ఎంత అసురక్షితంగా ఉన్నాయోనని అనిపించిందని శ్రీజన్ వెల్లడించారు. రాత్రి 10 గంటలకు సర్జాపూర్‌లో భయానక సంఘటనను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అయితే వారిలో కొంత మంది దుండగులు కారులో ఉన్న వ్యక్తులను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారని అతను పేర్కొన్నాడు. సర్జాపూర్ ఈ సంఘటనలకు హాట్‌స్పాట్‌గా ఉందన్నారు. ఇలాంటి సంఘటలను అరికట్టడానికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని కోరారు. ఇది తెలిసిన మరికొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల(comments) రూపంలో తెలియజేస్తున్నారు. మహిళలు రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లరాదని చెబుతున్నారు. దీంతోపాటు గుర్తు తెలియని వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. తెలియని వారిని ఎక్కువగా చూడటం లేదా వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయోద్దని చెబుతున్నారు.