Love Mouli actor Navdeep reacts on Bangalore rave party
Bangalore rave party: బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన విషయం ఎంత దూమారం లేపిందో అందరికీ తెలిసిందే. బెంగళూరు పోలీసులు ఈ కేసును వేగవంతం చేశారు. దీనిపై సినీ నటుడు నవదీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో తాను హాజరు అయినట్టు వార్తలు రానందుకు కొంత మంది నిరుత్సాహపడి ఉంటారని సినీ నటుడు నవదీప్ పేర్కొన్నారు. దీనిపై చాలా మంది నెటి జనులు ఆయన్ను ప్రశ్నలు అడిగారట. ఏంటన్నా ఈ సారి నీ పేరు వినిపించలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అయన్ను ప్రశ్నించారని పేర్కొన్నారు.
నవదీప్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ మౌళి. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉంటున్నారు. దానిలో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇలాంటి రేవ్ పార్టీల విషయం తెరపైకి వస్తే మీ పేరు మొదటగా వినిపించేది. ఈ సారి అదేందుకు జరగలేదు అనే ప్రశ్నను ఓ జర్నలిస్టు అడిగారు. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ జవాబు ఇచ్చారు. అలాగే రేవ్ పార్టీ అంటే ఏంటో చెప్పారు. మాములుగా రేవ్ పార్టీలు అంటే రేయి, పగలు జరుగుతాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా నిర్వహిస్తారు అని చెప్పారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.