»Fire Accident China Shanxi Province Mining Company Office 25 People Died
Fire accident: చైనాలోని ఓ భవనంలో మంటలు..25 మంది మృతి
బొగ్గు కంపెనీ భవనంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఘటనలో 25 మంది మరణించగా.. డజన్ల కొద్ది సిబ్బంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తర చైనీస్ షాంగ్సీ ప్రావిన్స్‌లోని లులియాంగ్ సిటీలో చోటుచేసుకుంది.
fire accident china Shanxi province mining company office 25 people died
చైనా(china)లోని షాంగ్సీ ప్రావిన్స్(Shanxi province)లోని యోంగ్జు కోల్ ఇండస్ట్రీ కార్యాలయ భవనంలో ఆకస్మాత్తుగా పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రం నడిబొడ్డున ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఉదయం 6:50 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర బ్రాడ్‌కాస్టర్ CCTV ద్వారా ప్రాథమిక నివేదికల ప్రకారం మొదట 11 మంది మృత్యువాత చెందారని ప్రకటించారు. మరో 51 మంది గాయపడినట్లు నివేదించాయి. అయితే ఈ ఘటన నేపథ్యంలో మృతుల సంఖ్యను రెండుసార్లు సవరించారు. అయితే ఈ ఘోర అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. రెస్క్యూ, అత్యవసర సేవలు ఘటనా స్థలంలో ఉన్నాయని జిల్లా అధికారులు పేర్కొన్నారు. 25 మంది మరణించినట్లు ధృవీకరించినట్లు రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. ఇప్పటి వరకు మొత్తం 63 మందిని ఖాళీ చేయించారు. వీరిలో 51 మందిని చికిత్స కోసం లులియాంగ్ ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్‌కి పంపబడ్డారు. అయితే చనిపోయిన 25 మంది ఆ గణాంకాలలో ఉన్నారా అనేది అస్పష్టంగా ఉంది.
A fire engulfed building cause at least 25 peoples died, and dozens were injured in the Lüliang of Shanxi Province, China 🇨🇳 (16.11.2023)
ఏప్రిల్‌లో బీజింగ్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 29 మంది విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు తరచుగా జరగడం పట్ల స్థానిక అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బొగ్గు ఉత్పత్తిదారులు ఇటీవలి నెలలుగా అనేక ప్రమాదాల్లో చిక్కుకున్నారు. తరచుగా జరిగే ఈ విషాదాల కారణంగా బొగ్గు గని(coal mine) కార్యకలాపాలలో భద్రతా తనిఖీలు, తాత్కాలిక మూసివేతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం ఏర్పడుతుంది.