China: Illegal pregnancy tests for women applying for jobs
China: చైనాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు గర్భ నిర్ధరణ పరీక్షలు చేయిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఉద్యోగాల్లో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. జింగ్సు ప్రావిన్స్‌లోని నాన్టాంగ్లోని 16 కంపెనీలు తమ వద్ద ఉద్యోగాలకు వచ్చిన 168 మంది మహిళలకు అక్రమంగా గర్భనిర్ధరణ పరీక్షలు చేయించాయి. ఉద్యోగం ఇచ్చే ముందు ఫిజికల్ టెస్ట్ అని చేయించాయి. చైనాలో చాలా కంపెనీలు పిల్లల్ని సాకే వయసులోని మహిళలను విధుల్లోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కొన్ని కంపెనీలు ఇంటర్వూల్లో మహిళలకు సంబంధించిన ఫ్యామిలీ ప్లానింగ్ వివరాలను సేకరిస్తున్నాయి. అయితే చైనా కంపెనీల యాజమాన్యలు గర్భిణుల విషయంలో వివక్ష చూపడం, గర్భనిర్ధరణ పరీక్షలు నిర్వహించడంపై నిషేధం విధించింది. అయిన టెస్ట్‌లు చేశారు. నేరాలకు పాల్పడిన కంపెనీకి 6900 డాలర్ల ఫైన్ విధించే అవకాశముంది.