»China Chinese Businessman Found Guilty Of Billion Dollar Fraud
China: బిలియన్ డాలర్ల మోసంలో దోషిగా తేలిన చైనా వ్యాపారవేత్త
అమెరికా కోర్టులో చైనా వ్యాపారవేత్త, టైకూన్ గువో వెన్గుయి దోషిగా తేలారు. బిలియన్ డాలర్ల స్కామ్‌లో అతను తన ఆన్లైన్ ఫాలోవర్లను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 12 క్రిమినల్ కేసుల్లో అతని తొమ్మిది కేసుల్లో దోషిగా తేలారు.
China: Chinese businessman found guilty of billion dollar fraud
China: అమెరికా కోర్టులో చైనా వ్యాపారవేత్త, టైకూన్ గువో వెన్గుయి దోషిగా తేలారు. బిలియన్ డాలర్ల స్కామ్‌లో అతను తన ఆన్లైన్ ఫాలోవర్లను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 12 క్రిమినల్ కేసుల్లో అతని తొమ్మిది కేసుల్లో దోషిగా తేలారు. అతనిపై రాకటేరింగ్ ఫ్రాడ్, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. నవంబర్ 19వ తేదీన ఈ కేసులో అతనికి శిక్షను ప్రకటించనున్నారు. ఇతనికి దశాబ్దాల పాటు శిక్ష పడే అవకాశం ఉందని జిల్లా జడ్జీ అనలిసా టోర్రెస్ తెలిపారు. గతేడాది మార్చిలో అతనిని అరెస్టు చేశారు.
అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నాడు. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్లకి క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్ గురించి 2018 నుంచి 2023 వరకు హామీ ఇచ్చాడు. ఇలా సుమారు వంద కోట్ల డాలర్ల డబ్బును సేకరించాడని, చైనా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసేందుకు ఆ డబ్బును వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ ఫాలోవర్ల నుంచి సేకరించిన సొమ్మును లగ్జరీ వస్తువులు ఖరీదు చేసేందుకు వాడినట్లు సమాచారం. న్యూజెర్సీలో భవంతి, రెడ్ లాంబోర్గిని కొన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
చైనా కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకి అయిన వెన్గుయి ట్రంప్ వద్ద చీఫ్ స్ట్రాటజిస్ట్‌గా చేసిన స్టీఫెన్ బానన్‌కు దగ్గరి మిత్రుడు. గున్వెయికి అనేక పేర్లు ఉన్నాయి. ఆయన్ను రకరకాలుగా పిలుస్తుంటారు. కేసు నమోదు చేసినప్పుడు అతని పేరును హో వాన్ కివోక్గా రాశారు. ఆన్లైన్ ఫాలోవర్లను మోసం చేసి గున్వెయి సంపన్న జీవితాన్ని గడిపినట్లు మన్హటన్ అటార్నీ డామియన్ విలియమ్స్ తెలిపారు.