»Indian Population Indias Population Will Be 170 Crores By 2060
Indian Population: 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా అవతరించింది. అయితే చైనాను అధిగమించి భారత్ ఈ శతాబ్దం మొత్తం మొదటి స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
Indian Population: India's population will be 170 crores by 2060?
Indian Population: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా అవతరించింది. అయితే చైనాను అధిగమించి భారత్ ఈ శతాబ్దం మొత్తం మొదటి స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. చైనాలో ప్రస్తుతం ఉన్న జనాభాలో దాదాపు సగం మంది తగ్గిపోతారని తెలిపింది. ఈక్రమంలో వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. 2024లో భారత్ జనాభా 145 కోట్లు. అది 2054 నాటికి 169 కోట్లకు చేరుతుంది. అలా క్రమంగా 150 కోట్లకు తగ్గుతుంది.
అయితే, 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుతుంది. తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా తగ్గుతుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లు. 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుంది. 2100 నాటికి ఏకంగా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకు పడిపోతుంది. ఇది 1950ల నాటి ఆ దేశ జనాభాతో దాదాపు సమానం. 2024-54 మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుంది. ఈ కాలంలో చైనాలో 20 కోట్లు, జపాన్లో 2 కోట్లు, రష్యాలో కోటి జనాభా తగ్గనుంది. ఈ శతాబ్దం చివరి నాటికి భారత జనాభా చైనాకు రెండున్నర రెట్లు ఎక్కువగా ఉంటుంది.
సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణమని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ప్రస్తుతం సంతాన సాఫల్యత రేటు 2.25 వద్ద కొనసాగుతోంది. 2054 వరకు పాకిస్థాన్ 38.9 కోట్లు జనాభాతో అమెరికాను దాటేసి జనాభా పరంగా ప్ర్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుంది. ప్రస్తుతం 34.5 కోట్లతో మూడోస్థానంలో ఉన్న అమెరికా 2054 వరకు నాలుగో స్థానానికి పడిపోతుంది.