»Microsoft Blue Screen Of Death Outage Full List Of Services Hit In India
Blue Screen Of Death: మైక్రోసాఫ్ట్ ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్’.. విండోస్ సేవాల్లో అంతరాయం.. ఫ్లైట్ సర్వీస్‌లపై ప్రభావం
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. సిస్టమ్ ఆన్ చేయాగానే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్ చూపిస్తూ.. సిస్టమ్ షట్ డౌన్, లేదా రిస్టార్ట్ అవుతుంది. దీంతో కస్టమర్లు ఆందోళన చెందారు. కేవలం కంప్యూటర్లే కాదు విమాన సర్వీస్‌లపై కూడా దీని ప్రభావం పడింది.
Microsoft 'Blue Screen Of Death' Outage: Full List Of Services Hit In India
Blue Screen Of Death: యుఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు “బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్” ఎర్రర్ ఎదుర్కొంటున్నారు. ఇది రావడంతో వారి కంప్యూటర్లు షట్ డౌన్, లేదా రిస్టార్ట్ అవుతున్నాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ సమస్య ఉత్పన్నం కావడంతో కస్టమర్లు ఆందోళనతో ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ 365, మైక్రోసాఫ్ట్ టీమ్, మైక్రోసాఫ్ట్ అజూర్ సంస్థలు స్పందించాయి.
ప్రథమికంగా మైక్రోసాఫ్ట్ తెలియజేసిన విషయం ఏంటంటే..”కాన్ఫిగరేషన్ మార్పు” వలన ఈ సమస్య వచ్చిందని, అందువలన కంప్యూటర్లు కనెక్టివిటీ దెబ్బ తినందని కంపెనీ తెలిపింది. అంతే కాదు ఈ సమస్యల వలన విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడిందని, ఫ్లైట్స్ టికెట్లు క్యాన్సిల్ అవుతున్నాయని కస్టమర్లు వాపోతున్నారు. దీని వలన అనౌన్స్ చేసే కేంద్రాల్లో, విమానాశ్రయాల వద్ద రద్ది పెరిగింది.
“మా సర్వీస్ ప్రొవైడర్‌తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యల కారణంగా, బుకింగ్, చెక్-ఇన్, మేనేజ్మెంట్ బుకింగ్ సేవలతో సహా మా ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు” అని ఆకాస ఎయిర్‌లైన్ X పోస్ట్‌లో తెలిపింది.
“విమాన అంతరాయాలపై నవీకరణలను అందించడంలో మేము ప్రస్తుతం సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి మా బృందం పని చేస్తోంది. అసౌకర్యానికి చింతిస్తున్నాము. సమస్య పరిష్కరించబడిన తర్వాత మీకు తెలియజేస్తాము. మీ సహకారానికి ధన్యవాదాలు ,” అంటూ స్పైస్‌జెట్ Xలో పోస్ట్ చేసింది.