»Siddaramaiah Deletes Post On 100 Quota Bill Karnataka Minister Clarifies
Siddaramaiah: 100% ఉద్యోగ రిజర్వేషన్లపై సిద్ధరామయ్య పోస్ట్ డిలీట్.. క్లారిటీ ఇచ్నిన మంత్రి
ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో కర్ణాటక ప్రజలకే 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. తాజాగా ఆ పోస్టును తొలగించడంపై రాష్ట్ర మంత్రి స్పష్టత ఇచ్చారు.
Siddaramaiah Deletes Post On 100% Quota Bill, Karnataka Minister Clarifies
Siddaramaiah: కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల రిజర్వేషన్లు గురించిన పోస్టును ముఖ్యమంత్రి సిద్దరామయ్య తొలగించడంపై మంత్రి సంతోష్ లాడ్ స్పష్టత ఇచ్చారు. ప్రైవేట్ సంస్థలలో నాన్-మేనేజ్మెంట్ ఉద్యోగాలకు 70 శాతం, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు 50 శాతానికి పరిమితం చేసినట్లు కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం ప్రకటన విడుదల చేశారు. అయితే కర్ణాటక ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో 100 శాతం అక్కడి ప్రజలకే రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్టు చేశారు. దీంతో వివాదం నెలకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేట్ సంస్థలలో కచ్చితంగా కన్నడ ప్రజలకే ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో గ్రూప్ ‘సి, డి’ గ్రేడ్ల పోస్టులకు 100 శాతం ఇక్కడి ప్రజలనే నియమించాలని ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణియించినట్లు మంగళవారం చెప్పారు. ఆయన ఎక్స్ ఖాతాలో కూడా పోస్టు చేశారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వివాదం రాజేసుకుంది. ఆ తరువాత మంత్రి సంతోష్ లాడ్ వివరణ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోస్టును తొలగించారు.