Charmadi Waterfalls: టూరిస్టులకు షాక్ ఇచ్చిన పోలీసులు
ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలని వాటర్ఫాల్స్కి వెళ్తుంటారు. ఇలాంటి ప్రదేశాల్లో ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ ఎవరూ పట్టించుకోకుండా ఉంటారు. ఇలా పట్టించుకోని కొందరు పర్యాటకులకు పోలీసులు డిఫరెంట్గా బుద్ది చెప్పారు.
Charmadi Waterfalls: సెలవులు వచ్చాయంటే.. చాలామంది పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయాలని వాటర్ఫాల్స్కి వెళ్తుంటారు. ఇలాంటి ప్రదేశాల్లో ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ ఎవరూ పట్టించుకోకుండా ఉంటారు. ఇలా పట్టించుకోని కొందరు పర్యాటకులకు పోలీసులు డిఫరెంట్గా బుద్ది చెప్పారు. కర్ణాటకలోని ముడిగేరిలో ఉన్న చార్ముడి జలపాతం దగ్గరకు పర్యాటకులు వెళ్తుంటారు. వర్షాలకు నీరు ఎక్కువగా ఉండటంతో ఆ జలపాతం వద్ద స్నానం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది.
అయినా కొందరు టూరిస్టులు పట్టించుకోకుండా ఆ జలపాతంలో స్నానాలు చేయడం ప్రారంభించారు. వాళ్లు ఆ జలపాతం దగ్గరే దుస్తులు అవి విడిచి జలపాతంలో స్నానాలు చేసేవారు. టూరిస్టులు విడిచివెళ్లిన దుస్తులను పోలీసులు తీసుకెళ్లిపోయారు. బట్టలు ఇమ్మని అడిగినా ఇవ్వలేదు. తమ దుస్తులు ఇమ్మని వాళ్లు అర్థనగ్నంగా పోలీసులను వేడుకున్నారు. అలా పర్యాటకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ల బట్టలు ఇచ్చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టూరిస్టులకు మంచిగా బుద్ధి చెప్పారని అన్నారు.