Gold and Silver Rates Today : గత వారం అంతా.. ఎక్కువగా పెరగడం, కాస్త తగ్గడం అన్నట్లు బంగారం ధర ట్రెండ్ నడిచింది. మరి ఈ వారం ఈ ధరల ట్రెండ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ వారం ప్రారంభంలో పసిడి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. సోమవారం రూ.90 తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ.75,210కి చేరుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు((Gold Rates) దాదాపుగా ఇలాగే ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల సైతం 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధరలు రూ.75,210గానే ఉన్నాయి. అయితే నగల్ని కొనుక్కునేప్పుడు వినియోగదారులు దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ, రాళ్లు, మజూరీ తదితరాలకు అదనంగా చెల్లించాలి. కాబట్టి వినియోగదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
వెండి ధరలు గత రెండు వారాలుగా అప్ట్రెండ్లోనే నడుస్తున్నాయి. గత వారాంతానికి మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం కూడా కిలో వెండి ధర(Silver Rate) రూ.169 మాత్రమే తగ్గింది. దీంతో దీని ధర నేడు రూ.94,440కు చేరుకుంది. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల సైతం దీని ధరలు ఇలాగే ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ నేడు డాలరు పెరిగింది. దీంతో దీని ధర 2412 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి 30.92 డాలర్లుగా ఉంది.