»Yadagirigutta Giripradakshina Started At Yadagirigutta
Yadagirigutta: యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరిప్రదక్షిణ
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ప్రతినెలా గిరిప్రదక్షిణ జరుగుతుంది. అయితే గత నెలలో చేపట్టిన గిరిప్రదక్షిణలో 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ నెల గిరిప్రదక్షిణ ఈరోజు ఉదయం ప్రారంభమైంది.
Yadagirigutta: Giripradakshina started at Yadagirigutta
Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ప్రతినెలా గిరిప్రదక్షిణ జరుగుతుంది. అయితే గత నెలలో చేపట్టిన గిరిప్రదక్షిణలో 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర కొనసాగే గిరి ప్రదక్షిణ ఈరోజు 6:05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఈకార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కూడా పాల్గొన్నారు.
గిరిప్రదక్షిణ సందర్భంగా వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రహదారికి ఇరువైపులా, మల్లాపురంలోని గోశాల తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపుగా రెండు వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆషాడ మాసం కావడంతో భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. సుమారుగా 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. వీఐపీ టికెట్ దర్శనానికి గంట, ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ శాఖల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 45,68,806 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.