»Devotees Flocking To Yadadri Temple Rs Crore Income Per Day
Yadadri: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు..ఒక్కరోజే రూ.కోటి ఆదాయం
యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఒక్కరోజే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడంతో కోటి రూపాయలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
యాదాద్రి (Yadadri)లోని లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం వద్ద రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతో ఒక్కరోజే రూ.కోటి 9 లక్షల వరకూ ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 5,20,800, కైంకర్యాల ద్వారా రూ. 2,500, సుప్రభాతం ద్వారా రూ. 23,700, బ్రేక్ దర్శనం వల్ల రూ. 10,85,400, వ్రతాల ద్వారా రూ. 12,46,400 ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇకపోతే ఆలయం వద్ద వాహన పూజల ద్వారా రూ. 24,400, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 23,85,000, ప్రచారశాఖ ద్వారా రూ.1,31,679, పాతగుట్టలో పూజల ద్వారా రూ. 3,29,200, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 8 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. యాదఋషి నిలయం ద్వారా రూ. 3,73,792, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 2,91,096, శివాలయం ద్వారా రూ. 16,500, పుష్కరిణీ ద్వారా రూ. 4,200, ప్రసాద విక్రయం ద్వారా రూ. 34,31,490 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా శాశ్వత పూజల ద్వారా రూ. 42,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 1,91,900 , అన్నదానం ద్వారా రూ. 28,611, గది విరాళం ద్వారా రూ.11,700 ఆదాయం ఆలయానికి సమకూరినట్లుగా ఆలయ అధికారులు వివరించారు.