Medaram : ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం సమక్క సారలమ్మ జాతర. ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర జరగనున్న సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు పోటెత్తుతారు. గిరిజన సంప్రదాయంలో నిర్వహించే మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది.
ప్రతిసారీ కనీసం నాలుగు నెలల ముందు జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. మొత్తం 21 శాఖలు జూలైలోనే రూ.75 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. దాదాపు 5 నెలలుగా నిధులు కేటాయించలేదు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు పెండింగ్లో ఉన్నాయి. అయితే మేడారం జాతర నిధులు విడుదల చేసి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.