»Allu Arjun Second Single Update From Pushpa2 When
Pushpa2: పుష్ప2 నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్.. ఎప్పుడంటే?
పుష్ప ది రైజ్ ఎంత సంచలనం సృష్టించిందో దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ కూడా తగ్గేదేలే అంటూ మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ పుష్ప రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఆడియెన్స్ కోసం పుష్ప 2 నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు.
Allu Arjun second single update from Pushpa2.. when?
Pushpa2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ చిత్రం మీద ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లలో అదే అంచనాలు ఉన్నాయి. తాజాగా పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ రావడంతో బన్ని ఫ్యాన్స్ అందరూ అదే మేనియాలో ఉన్నారు. అంతే కాదు చిన్న నుంచి పెద్దల వరకు, సామాన్యుల నుంచి స్టార్ల వరకు అందరూ పుష్ప రాజ్ స్టైల్లో తగ్గేదేలే అంటూ బన్ని మ్యానరిజాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సారి కూడా లెక్కల మాస్టర్ లెక్క తప్పడు అని ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థం అవుతుంది.
పుష్ప ది రైజ్ ఎంత సంచలనం సృష్టించిందో దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప ది రూల్ కూడా తగ్గేదేలే అంటూ మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ పుష్ప రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేశాయి. ఫస్ట్ సింగిల్లోని సిగ్నేచర్ స్టెప్ విపరీతంగా వైరల్ అవుతుంది. సెలబ్రెటీలు సైతం ఆ స్టెప్‌ను రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ వస్తుందని మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. గురువారం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతోన్నట్టుగా హింట్ ఇచ్చారు. ఈ సారి మాత్రం కచ్చితంగా రొమాంటిక్, లవ్ సాంగ్‌ను విడుదల చేసే ఆలోచనల్లో మేకర్స్ ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో శ్రీవల్లి పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఇప్పుడు రిలీజ్ చేయబోయే పాట కూడా అలానే ఉంటుందని బన్ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.